నేటి తరం యువతలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కల. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా తక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. నవంబర్ 6వ తేదీన ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా 2020 డిసెంబర్ 15న నోటిఫికేషన్ ప్రక్రియ ముగియనుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజల క్లర్క్ ఉద్యోగాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, పలు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, టైర్ 2 పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్ పాసైన వారంతా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2021 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ పరీక్షలు జరుగుతాయి. 2021 ఏప్రిల్ 12 నుంచి 27వ తేదీ వరకు లెవెల్ టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 – డిస్క్రిప్టివ్ పేపర్, టైప్ 3 స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటాయి. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారో తెలియాల్సి ఉంది. గతేడాది 4893 ఉద్యోగాల భర్తీ జరగగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలవుతుంది. సిలబస్ ప్రకారం పరీక్షలకు ప్రిపేర్ అయితే సులువుగా ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here