వాల్నట్ లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు!

0
531

ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వాటిలో వాల్నట్ కూడా ఒకటి. ఈవాల్నట్ లో అధిక భాగం ఔషధగుణాలతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ విధమైనటువంటి పోషకాలు మనకు కేవలం వాల్నట్ కాయలలో మాత్రమే కాకుండా వీటి నుంచి తయారు చేసే నూనెలో కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనెలో పోషకాలతో పాటు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు మనకు అందుతాయి.

వాల్నట్ నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉంది. కనుక ఈ నూనెను మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎటువంటి గుండె సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

వాల్నట్ నూనెలో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని వంటలు తయారు చేయడానికి ఉపయోగించకూడదు. వంటలు తయారు చేయడానికి ఈ నూనెను ఉపయోగిస్తే వంటలు కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటాయి కనుక వీటిని సలాడ్ లో కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వాల్నట్ నూనెలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయి. మృదువైన చర్మం పొందాలనుకునేవారు వాల్నట్ నూనెతో ముఖంపై మసాజ్ చేసుకోవడం వల్ల అందమైన కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మం పై ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను తొలగించి చర్మాన్ని ఎంతో మృదువుగా అందంగా తయారుచేస్తాయి.

పెరుగు లేదా తేనెలో ఐదు చుక్కలు వాల్నట్ నూనెవేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల ముఖం పై ఏర్పడిన మృతకణాలు తొలగిపోతాయి. వాల్నట్ తిన్న వారిలో చర్మంపై దద్దుర్లు ఏర్పడిన వారు ఈ వాల్నట్, వాల్నట్ నూనెకు దూరంగా ఉండటం మంచిది.