దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన హీరో టూ వీలర్ మోటార్స్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హీరో మోటార్స్ కంపెనీలు మూతబడనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో కంపెనీ ఈ విధంగా తమ సంస్థలన్నింటినీ మూసివేయడానికి గల కారణం కేవలం కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసులు సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు చేశారు . మరికొన్ని చోట్ల రాత్రి సమయాలలో కర్ఫ్యూ విధించారు.ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల కారణంగానే కంపెనీ కొద్దిరోజులపాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ప్రతి ప్లాంటు మూసివేసి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఈ విధంగా ప్లాంటు మూసివేసి ఉన్న సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని కంపెనీ వెల్లడించింది. అదే విధంగా కంపెనీకి చెందిన అన్ని ఆఫీసులు కూడా మూసివేయడంతో తమ కంపెనీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా కంపెనీ వాహనాల తయారీలను నిలిపివేస్తే వాహనాలపై అధిక ఒత్తిడి పడే అవకాశాలు ఏమాత్రం లేవని తెలియజేసింది.

మే 1 తర్వాత యధావిధిగా ప్లాంటు తెచ్చుకున్న తర్వాత కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు కంపెనీ తెలియజేసింది. ఇప్పటికే తమ కంపెనీ గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, హలోల్, చిత్తూరు, నీమ్రానా వంటి ప్రాంతాల్లో తయారీ ప్లాంట్లులు ఉన్నట్లు హీరో మోటార్స్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here