దేశ జనాభా పెరుగుతూ పోతుంది. తాజాగ కేంద్ర జనాభా లెక్కలు విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది మరణిస్తున్నారు. జనవరి 1 2019 నుంచి డిసెంబరు 31 2019 వరకూ మన దేశంలో నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జనాభా లెక్కల శాఖ విడుదల చేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్ జనాభా 5,23 కోట్లకి చేరుకుంది. అయితే ఏపీలోని జిల్లాలవారీగా జననాల్లో కర్నూలు జిల్లా టాప్ ప్లేస్ లో ఉంటే.. మరణాల్లో మాత్రం తూర్పుగోదావరి జిల్లా ముందువరుసలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర జనాభా చూస్తే 3.72 కోట్లుగా ఉంది.



























