బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇప్పటికే సుశాంత్ ది హత్య కాదని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అయితే కొందరు మాత్రం సుశాంత్ ది హత్యేనని కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగా ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే రియాను అరెస్ట్ చేసిన అధికారులు పలువు స్టార్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసి విచారణ జరిపారు. డ్రగ్స్ గురించి వెలుగులోకి రావడంతో సుశాంత్ కేసు పక్కదారి పట్టిందనే కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సుశాంత్ మృతి గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. సుశాంత్ ది ఆత్మహత్య కావచ్చని అయితే సుశాంత్ మృతికి కారణాలు మాత్రం వేరని ఆమె చెప్పారు.

సుశాంత్ సింగ్ యువకుడని… మంచి ప్రతిభ ఉన్న హీరో అని అలాంటి హీరోకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. తన లైఫ్ ప్రమాదంలో ఉన్నట్టు సుశాంత్ చాలా సందర్భాల్లో వెల్లడించాడని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సుశాంత్ ను కొందరు బెదిరించారని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ కు కొందరు అవకాశాలు రాకుండా చేశారని తెలిపారు.

మూవీ మాఫియా సుశాంత్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. సుశాంత్ పై కొందరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని.. వాళ్లు చేసిన ఆరోపణలే సుశాంత్ ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని తెలిపారు. సుశాంత్ తీవ్ర మానసిక వేదనకు గురి కావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here