శేఖర్ కమ్ములకు వార్నింగ్ ఇస్తున్న నెటిజన్స్.. అంతా కత్తి మహేష్ వల్లే..!

0
1186

తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్ మరణం ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొన్ని రోజుల కిందట తాను ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టడంతో కత్తి మహేష్ కు ప్రమాదం జరిగింది. దీంతో స్వల్ప గాయాలతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత చెన్నైలోని హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యం జరుగుతుండగా శనివారం సాయంత్రం తన ప్రాణాలను వదిలాడు. ఇక సినీ రంగానికి చెందిన వాళ్లు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ కమ్ముల కూడా ఆయన మరణం పట్ల ఓ పోస్ట్ చేయగా.. నెటిజన్లు తెగ మండిపడుతున్నారు.

నిజానికి కత్తి మహేష్ ఇండస్ట్రీకి చెందిన నటులను బాగా విమర్శలు చేస్తూ ఉంటాడు. పవన్ పట్ల తెగ విరుచుకుపడుతుంటాడు. సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో సంచలనం రేపుతుంటాడు. ఇక ఈయన పై నెటిజన్లు కూడా తెగ మండిపడుతుంటారు. గతంలో శ్రీ రాముడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, సీతాదేవిపై చేసిన విమర్శల పట్ల ఆయనపై తెగ మండిపడ్డారు ప్రజలు. ఆయన మరణించాక కూడా ఇంకా విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.

తెలుగు సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ మరణం గురించి సంతాపం తెలిపాడు. కత్తి మహేష్ మరణం తీరని లోటని, ఆ లోటును పూడ్చడం చాలా కష్టమని అన్నాడు. అంతే కాకుండా ఆయన శాస్త్రీయ దృక్పథం ఉన్నా నిజమైన పోరాటయోధుడు అని అనడంతో ఈ వ్యాఖ్యలను చూసిన నెటిజన్లు శేఖర్ కమ్ముల పై తెగ విరుచుకుపడుతున్నారు. గతంలో శ్రీరాముడు పై చేసిన వ్యాఖ్యలు గురించి అతనిని ద్వేషించకుండా అతని మరణం పై మీ దగ్గర నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేమంటున్నారు.

శ్రీ రాముల వారిని దూషించినప్పుడు ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ‘సినీ ఇండస్ట్రీలో కొందరు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా వారి గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. అలాగే మీరు కూడా అలాంటి లిస్ట్ నుండి వెళ్లకుండా చూసుకోండి’ అనే తెలుపుతున్నారు. అంతే కాకుండా నిన్న జస్వంత్ రెడ్డి అనే ఒక జవాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతను కదా నిజమైన ఫైటర్.. అలాంటి మహానుభావులను వదిలి శ్రీరామునిపై దూషించిన కత్తి మహేష్ ఎలా ట్రూ ఫైటర్ అవుతాడని.. శేఖర్ కమ్ముల పై బాగా మండిపడుతున్నారు.