సాధారణంగా అమ్మాయి కాళ్లను చూసి కొందరు అమ్మాయి వ్యక్తిత్వాన్ని చెబుతుంటారు. ముఖ్యంగా బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే చాలా గడుసుదని, తన భర్తను తన చేతుల్లో పెట్టుకుంటుందని చెబుతుంటారు. ఈ విధంగా కాళ్ళ వేళ్ళను బట్టి కొందరు వ్యక్తులు కొన్ని విషయాలను చెబుతుంటారు. మిగతా వేళ్ళ కంటే బొటన వేలు పెద్దగా ఉంటే ఏం జరుగుతుంది? చిటికెన వేలు పొడవుగా ఉంటే వారి స్వభావం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నింటి కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కాళ్ల వేళ్లను బట్టి వారి స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా కాలి మిగతా వేళ్ళకంటే బొటనవేలు పెద్దగా ఉన్న వారు ఎంతో తెలివితేటలతో, ఎంతో సృజనాత్మకతతో ఉంటారు. అంతే కాకుండా మిగతా వేళ్లతో పోలిస్తే బొటనవేలు చిన్నగా ఉన్నవారు ఎలాంటి పనైనా ఎంతో సులభంగా చేయగలరు. బొటన వేలు కన్నా దాని పక్క వేలు పొడవుగా ఉంటే వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఎంతో ధైర్యం సాహసాలను కలిగి ఉంటారు. బొటనవేలు కంటే పక్కన వేలు పొట్టిగా ఉండేవారికి అందరిలో కలిసిపోయే తత్వం ఉంటుంది.

కొందరిలో కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి మిగిలిన రెండు వేళ్ళు పొట్టిగా ఉంటాయి. అలాంటి వారు ఎంత శక్తివంతంగా, దృఢంగా ఉంటారు. చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే అలాంటి వారు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఎదుటివారి చెప్పే మాటలను శ్రద్ధగా వింటారు. అంతేకాకుండా కాలి నాలగవ వేలు పొట్టిగా ఉండేవారు కుటుంబం పట్ల, బంధుత్వాల పట్ల పెద్దగా ఆసక్తిని కనబర్చరు.వీరు బంధాలకు విలువ ఇవ్వరు. చిటికెన వేలు నాలుగవ వేలికి అతుక్కుని ఉంటే అలాంటి వారిలో ఎక్కువగా భయం, బిడియం ఉంటుంది. అలాంటివారు ఎవ్వరిలోనూ కలవరు. చిటికెన వేలు నాలగవ వేలికి దూరంగా ఉండేవారు ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. అంతేకాకుండా మీరు చమత్కారులని చెప్పవచ్చు. ఈ విధంగా కాలి వెళ్ళను బట్టి వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here