Kommanapalli Ganapathi Rao : నవలా రచయితగా రాసింది కొన్ని నావలలే అయినా అవన్నీ ప్రేక్షకాధరణ పొందిన నవలలే. ఒకవైపు ఉద్యోగం చెసుకుంటూనే మరో వైపు సాహిత్య రంగంలో కృషి చేసారు. ఇక ఆయన హంసధ్వని అనే నవలను సీరియల్ రూపంలో పత్రికకు రాస్తున్న సమయంలో ఆయన రచనలు నచ్చి నిర్మాత కాట్రగడ్డ మురారి గారు ఆయనను సినిమా రంగానికి పరిచయం చేసారు. శోభన్ బాబు హీరో గా వచ్చిన అభిమన్యుడు సినిమాకు మొదటి సారి పనిచేసారు. దాసరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. కుటుంబ కథా రచయితగా మంచి గుర్తింపు ఉన్న కొమ్మనపల్లి ఆయనకు నచ్చని పని చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పడం వల్ల ఇండస్ట్రీలో శత్రువులను కూడా పెంచుకున్నారట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయిత డైరెక్టర్ ను ఇండస్ట్రీకి అందించింది ఈయనే.

వాణిశ్రీ గారు చాలా చనువుగా ఉండేవారు..
కొమ్మనపల్లి గారు తన కెరీర్ సినిమాల గురించి మాట్లాడుతూ హీరోయిన్లలో సావిత్రి, వాణిశ్రీ అంటే చాలా ఇష్టమంటూ తెలిపారు. రచయితగా పనిచేస్తున్న సమయంలో వాణిశ్రీ గారు పరిచయమై బాగా క్లోజ్ అయ్యారంటూ తెలిపారు. తాను పెళ్లిచేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమయంలో అందరి మీద చాలా కోపంతో ఉండేవారు. సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా కొంచెం తేడా జరిగినా అలిగి వెళ్లిపోయేవారు. ఆ సమయంలో నిర్మాతలు డైరెక్టర్లు నా దగ్గరికి వచ్చి వెళ్లి మేడంను పిలుచుకురా నీ మాట వింటారు అని పంపేవారు. నేను వెళ్లి మీకు చాలా జాలి ఎక్కువ, ఇలా అలగడం వల్ల నిర్మాతకు నష్టం అని మళ్ళీ సాయంత్రానికి మీరే బాధపడతారు అవసరమా, రండి మీకోసం అందరూ ఎదురుచూస్తున్నారు అని చెబితే నిజామా గణపతి రావు అని అమాయకంగా అడిగేవారు.

ఆమె చాలా తక్కువ మందితో అలా చనువుగా ఉంటారు. అలా నాతో ఉండేవారు. ఇక ఒకసారి జనవరి ఒకటిన మందు పార్టీకి పిలిచి అక్కడ సావిత్రి గారి కూతురు అల్లుడు అందరినీ పరిచయం చేసారు. చాలా తక్కువ మంది అతిధులతో పార్టీ చేసారు. అందులో నాకు కాస్త మందు ఎక్కువ అయి గాడి తప్పుతున్నాను అని వాణిశ్రీ గారు పసిగట్టి నన్ను వేరే వాళ్ళ ద్వారా పంపించేశారు అంటూ కొమ్మనపల్లి గణపతి రావు వాణిశ్రీ గారితో ఉన్న అనుబంధం తెలిపారు.




























