Lakshmi Parvathi : లక్ష్మి పార్వతి అనగానే ఎన్టీఆర్ గారి రెండో భార్యగా అందరికీ తెలుసు. అయితే లక్ష్మి పార్వతి గారు మొదట ఎన్టీఆర్ గారి చరిత్ర రాయడానికి ఆయన వద్దకు వచ్చి ఆ తరువాత ఆయనకు నచ్చిన వ్యక్తిగా మారారు. ఇక ఆయన మరణం తరువాత పార్టీ పగ్గాలను తీసుకోవాలని భావించినా నందమూరి కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టినా పెద్దగా రాజకీయంగా ఆమెకు కలిసి రాలేదు. ఇన్నాళ్లు పెద్దగా కనిపించని లక్ష్మి పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీలో చేరి జగన్ తరుపున టీడీపీ ని విమర్శిస్తూ మీడియాతో తన జీవిత విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

నన్ను తిక్కలదానివి నువ్వు అంటారు… నేనేంటే చాలా ఇష్టం…
డాక్టరేట్ తీసుకుని తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ మాట్లాడగల నేను ఎన్టీఆర్ గారితో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి పార్టీ విజయంలో దోహదపడ్డాను. ఆయనతో వెళ్లి నేను ప్రచారం చేసి 256 సీట్లలో విజయం సాధించుకువచ్చాను అయినా నాకేమి అందులో క్రెడిట్ లేదు, అయినా కానీ ఏనాడూ పదవులను ఆశించలేదు. నాకు రెండు సార్లు రామారావు గారు కీలక పదవులను ఆఫర్ చేసినా నేను ఆయన భార్యగా ఉండటానికి ఇష్టపడ్డాను కానీ పదవులను తీసుకోవాలని అనుకోలేదు.

అందుకే ఆయన నన్ను నువ్వు తిక్కలదానివి అంటూ తిట్టేవారు. ఏనాడూ నాకు పదవీ వ్యామోహం లేదు అంటూ లక్ష్మి పార్వతి తెలిపారు. ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా ఇష్టం ఆయనకు కోపం వచ్చినా బాగా తిట్టేవాడు అలాగే ప్రేమ వచ్చినా మేరే యార్ అంటూ పిలిచేవాడు అంటూ అప్పటి ముచ్చట్లను పంచుకున్నారు.