భారీ స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన షియోమీ.. ఏకంగా 75 అంగుళాలు!

0
195

ఎంఐ కంపెనీ మన దేశంలో స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది. ఈటీవీ ఏకంగా 75 అంగుళాల పొడవు ఉంది. అదే ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన టీవీలలో షియోమీ టీవీ ఇదే.ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కే సిరీస్‌ డాల్బీ విజన్ ఫార్మాట్‌లో ఈ టీవీని లాంచ్ చేశారు.

ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75 ధరను మనదేశంలో రూ.1,19,999గా నిర్ణయించారు. అయితే ఇదే సైజులో ఉన్న ఇతర కంపెనీ ధరలతో పోలిస్తే షియోమీ తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని మనకు అందిస్తుంది. ఈటీవీ కి సంబంధించినటువంటి సేల్స్ మనదేశంలో ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతున్నాయి.ఫ్లిప్ కార్ట్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్ లలో కూడా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ లో 4కె సిరీస్ యూహెచ్‌డీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతం ఉండగా,120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.ఈ టీవీలో 30W స్టీరియో స్పీకర్ సిస్టంను అందుబాటులో ఉంది. దీనిలో 2 ట్వీటర్లు,4 ఊఫర్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీని వాయిస్ కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.ఒక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు, రెండు హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, రెండు యూఎస్‌బీ 2.0 పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి