“ఆర్టీసీని విలీనం చేయొద్దని…జగన్ కు కేసీఆర్ చెప్పారు..” ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

0
303

ప్రభుతంలో ఆర్టీసీ విలీనంపై ఆంద్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖలు చేసారు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్… సీఎం జగన్ చెప్పారు. అయినా జగన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదని.. ఇటీవల విజయవాడలో జరిగిన ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రతా అవార్డులు అందించే కార్యక్రమంలో ఇలా వ్యాఖ్యానించారు పేర్ని నాని.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారని, ఇది చాలా పొరపాటు అని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అన్నారని అయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి కార్మికుల జీతాలు పెద్ద గుదిబండ అని కేసీఆర్ అన్నారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయొద్దని కేసీఆర్ చూచించారని మంత్రి పేర్ని నాని అన్నారు. కానీ జగన్ దీన్ని ఒక సవాల్ గా తీసుకుని విలీనం చేసారని ఆయన అన్నారు. అలాగే కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానాని పేర్ని నాని అన్నారు. తమ ప్రభుత్వం, తాను చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని మంత్రి అన్నారు. ఇక సీపీఎస్ రద్దు, ఆర్టీసీ కార్మికుల ఫించన్ డిమాండ్లను కూడా సీఎం జగన్ నెరవేరుస్తారని.. అయితే ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు నమ్మకం ఉంచాలని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here