సాధారణంగా వాతావరణంలో మార్పులు కారణంగా జలుబు రావడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణ జలుబు చేసిన చాలామంది అది కరోనా లక్షణమేనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు.అయితే సాధారణమైన ఈ జలుబు నుంచి ఉపశమనం పొందడం కోసం ఎన్నో మాత్రలు వేసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలోనే జలుబును వివిధ రకాల పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకుంటే తొందరగా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

పుదీన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడం చేత పుదీనా ఆకును లేదా పుదీనా నూనెను ఎన్నో రకాల సమస్యలను నివారించడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే జలుబు గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు తొందరగా ఉపశమనం పొందాలంటే పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకుంటే చాలు తొందరగా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు .
ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న పుదీనా ఆకులను మరుగుతున్న వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ పుదీనా ఆవిరిని ముక్కుతో పిలిచి నోటితో వదలడం వల్ల జలుబు సమస్యతోపాటు గొంతు ఇన్ఫెక్షన్ నుంచి కూడా తొందరగా ఉపశమనం కల్పిస్తుంది. పుదీనాలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి పుదీనా విముక్తిని కల్పిస్తుంది.
అలాగే గొంతు ఇన్ఫెక్షన్ జలుబు సమస్యతో బాధపడేవారు పుదీనా టీ చేసుకొని తాగడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు ఇందులో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తో పోరాడి తొందరగా మనకు ఉపశమనం కల్పిస్తాయి. ఈ విధంగా సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి తొందరగా దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.


































