మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త..?

0
210

కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. ప్రజలు నగదును పొదుపు చేయడానికే తప్ప ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి సమయంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌ కోసం కేంద్రం 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు కేంద్రం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు కోట్ల రూపాయల లోపు రెసిడెన్షియల్ యూనిట్లు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ఎక్స్ ద్వారా కేంద్రం ఇంటి కొనుగోలుదారులకు ప్రయోజనం కల్పించనుంది. సర్కిల్ రేటుకు అగ్రిమెంట్ వ్యాల్యూకు మధ్య గతంలో వ్యత్యాసం 10 శాతంగా ఉండగా కేంద్రం ప్రస్తుతం ఆ వ్యత్యాసాన్ని 20 శాతానికి పెంచింది. నిర్మలా సీతారామన్ రైతులకు 65,000 కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీ, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి 900 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు.

పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ యోజన స్కీమ్ కు 10,000 కోట్ల రూపాయలు mgnregs స్కీమ్ కు 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తలిపారు. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here