Naveen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ ఒకరు. అయితే ఈయన గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరమైనటువంటి నరేష్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా పవిత్ర లోకేష్ కారణంగా నరేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు అయితే తాజాగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లోనవీన్ హీరోగా చేసినప్పటికీ అనంతరం సత్య అనే షార్ట్ ఫిలిం ద్వారా డైరెక్టర్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నవీన్ ఎన్నో విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మొదటి నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏది తోచితే అదే చేసే అలవాటు ఉంది ఇలా చేయడం వల్ల కొన్ని తప్పులు జరిగాయి అయితే మా ఫ్యామిలీ గురించి బయట ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని వాటి గురించి పట్టించుకోనని నవీన్ తెలిపారు. వారు కోరుకున్నట్టు బ్రతకాలంటే మేము బ్రతకలేమని తెలియజేశారు.

Naveen: పవిత్ర గారు బాగా తెలుసు..
ఇక నాన్న తన గురించి ఎవరు ఏమన్నా వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు ఆయనలో నాకు నచ్చినది ఇదేనని బయట ఎవరు ఎన్ని అనుకున్నా మా నాన్న హ్యాపీగా ఉండడమే మాకు ముఖ్యం అంటూ నవీన్ తెలిపారు.ఇక పవిత్ర గురించి కూడా మాట్లాడుతూ పవిత్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆమె నేను ఏదైనా పని మొదలు పెడుతున్నటువంటి సమయంలో ఆమె నాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటారు తరచూ నేను తనతో మాట్లాడుతూ ఉంటానని తనని పవిత్ర గారు అని పిలుస్తాను అంటూ నవీన్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.