నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం జాతిరత్నాలు.. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు.. అబ్దుల్లా ఫరియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి నూతన దర్శకుడు అనుదీప్ దర్శకుడు.. నాగ్ అశ్విన్ నిర్మాత.. వైజయంతి బ్యానర్ నుంచి చాల రోజుల తర్వాత వచ్చిన మంచి సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది.. రిలీజ్ అయినరోజునుంచి ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కి ఈ సినిమా హిట్ మంచి బూస్ట్ లాంటిది అని చెప్పొచ్చు.మొదటినుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..ఉప్పెన, నాంది సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే.. విడుదలై ఇన్ని రోజులవుతున్న ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా ఈ చిత్ర సక్సెస్ సందర్భంగా చిత్ర బృందం ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఆ ఇంటర్వ్యూ లో చిన్న సంఘటన చోటుచేసుకుంది.ఓ ప్రముఖ మీడియా ఛానల్ యాంకర్ మాత్రం పంచ్ వేయాలనుకుందో… నిజంగానో చెప్పిందో కానీ జాతి రత్నాల టీంకి దిమ్మతిరిగే పంచ్ వేసింది.జాతిరత్నాలు చూస్తూ తను 20 నిమిషాల పాటు నిద్రపోయానంటూ చెప్పి షాకిచ్చింది. ఈ మాట విన్న జాతిరత్నాలు షాకయ్యారు. వామ్మో… బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చూసేందుకు వెళ్లి నిద్రపోయారంటే ఏదో కారణం వుండి వుంటుంది. ఆ సినిమాకు మీ ఆయన్ని కూడా తీసుకెళ్లారా అంటూ పవర్ పంచ్ వేశాడు నవీన్ పోలిశెట్టి.

































