Posani Krishna Murali:పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో నటుడు దర్శకుడిగా కామెడీగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈయన వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా నిలబడి పార్టీ కోసం కృషి చేయడంతో ఈయనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పారు.

ఇలా ఈయన వైసిపి పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వారి పట్ల కూడా పలు సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచినటువంటి పోసాని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను చనిపోతే కనుక తన శవాన్ని ఇండస్ట్రీ వారికి చూపించవద్దు అటు తన భార్యకు చెప్పానని ఈయన తెలిపారు. అంతేకాకుండా నేను చనిపోతే నా భార్య పిల్లలు ఎవరు కూడా ఏడవకూడదు అలా ఉండేలాగా వారిని ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టానని ఈయన తెలియజేశారు.నేను చనిపోయిన తర్వాత నా భార్య నాతో ఉన్నటువంటి అందమైన క్షణాలన్నింటిని గుర్తు చేసుకోవాలి కానీ ఏడవకూడదు.

Posani Krishna Murali:50 కోట్ల ఆస్తులు రాశాను…
ఇకపోతే నా పిల్లలు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. నేను చనిపోయిన తర్వాత నా భార్య ఇబ్బంది పడకూడదు అందుకే తనకోసం 50 కోట్ల రూపాయల ఆస్తులను తన పేరు మీద రాశానని తను ఏ పని చేయకపోయినా నెలకు 9 కోట్ల రూపాయల సంపాదన అందుకుంటుంది అంటూ ఈ సందర్భంగా పోసాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన పోసాని చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ వారు ఎవరు చూడకూడదని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.