Ramyakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో అలనాటి స్టార్ హీరోలు సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా రంగమార్తండా సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది.

ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రమ్యకృష్ణ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ…” ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన నా మాట వినకుండా చాలా మొండిగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవరు సెలెక్ట్ కాకపోవటంతో ఈ పాత్రలో నేను నటిస్తానని చెప్పి ముందుకు వచ్చాను.

Ramyakrishna:కృష్ణవంశీ కెరియర్ లోనే బెస్ట్ సినిమా…
ఈ సినిమాలో నా పాత్రలో నటించాలి అంటే కళ్ళతోనే నటించాలని ఆయన చెప్పారు నేను కూడా అలాగే నటించా. అసలు ఈ సినిమాలో నా పాత్ర నివిడి ఇంత ఉంటుందని ఊహించలేదు అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది..ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా నాకు ఎమోషనల్ సినిమాలు నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమా కృష్ణ వంశీ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది” అంటూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.