మనలో చాలామంది బ్యాంకు లావాదేవీలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని నిబంధనల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆదాయపు పన్ను చట్టంలో దేశంలో పన్ను ఎగవేతలను తగ్గించడానికి ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ 269 ఎస్‌టీ ప్రకారం ఒకరోజులో 2 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేయకూడదు. ఒక్కరోజులో ఒకేసారి లేదా విడతల వారీగా 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం తీసుకోకూడదు.

ఒకేసారి 2 లక్షల రూపాయలకు పైగా నగదు విత్ డ్రా చేసి ఇచ్చినా లేదా తీసుకున్నా ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు జరిమానా రూపంలో చెల్లించే పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల మనం ఎక్కువ మొత్తంలో నగదు బ్యాంకు నుంచి విత్ డ్రా చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసీఎస్) లేదా అకౌంట్ పేయీ బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా అకౌంట్ పేయీ చెక్ ద్వారా మాత్రమే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు.

ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, భీమ్, ఆధార్ పే, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలను జరుపుకోవచ్చు. ఇలా జరిపిన లావాదేవీలను బ్యాంక్ అకౌంట్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ లావాదేవీలుగా పరిగణిస్తారు కాబట్టి లావాదేవీలు జరిపిన వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ మార్గాల ద్వారా రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం పొందినా ఎటువంటి సమస్య ఉండదు.

ఈ మార్గాల్లో కూడా ఇతర మార్గాల్లో లావాదేవీలు జరిపితే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. క్యాష్ రూపంలో లావాదేవీలు జరిపితే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లావాదేవీలకు సంబంధించి సరైన కారణాలు తెలియజేసి ఆధారాలు చూపితే పెనాల్టీ భారం నుంచి తప్పించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here