Rishab Shetty:.కన్నడ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఇటీవల కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల చేసిన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని అందరి అంచనాలను తారుమారు చేస్తూ అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించటం తో పాటు హీరోగా నటించిన రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా బాగా పాపులర్ అయ్యాడు.

ఈ సినిమా వల్ల దేశవ్యాప్తంగా రిషబ్ శెట్టి ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలైన తరువాత నేషనల్ క్రష్ రష్మిక, రిషబ్ శెట్టి మద్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయితే ఇటీవల కాంతార సినిమా పై రష్మిక చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేసింది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఇదే వివాదం ఇంకా కొనసాగుతుందని అనిపిస్తోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆరు సంవత్సరాల క్రితం డిసెంబర్ 30 వ తేదీన విడుదలై మంచి హిట్ అందుకుంది.ఈ విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి గుర్తుచేసుకొని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ రష్మికకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది.

Rishab Shetty: రష్మికను ట్యాగ్ చేయడం మర్చిపోయిన రిషబ్….
తాజాగా రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మా సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ మా కోసం మీరు చేసిన సందడి.. థియేటర్లో వేసిన విజిల్స్ ఇప్పటికీ మా చెవులలో మారుమోగుతున్నాయి. ఈ వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్విట్ చేస్తూ హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లోకనాథ్ ను ట్యాగ్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికని టాగ్ చేయకపోవడంతో రిషబ్ శెట్టి ఇన్ డైరెక్ట్ గా రష్మికకి కౌంటర్ ఇచ్చినట్లు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ’ ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq
— Rishab Shetty (@shetty_rishab) December 30, 2022