దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తిన్నారు. ఈ పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో చాలామంది కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ప్లాస్మా చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని వెల్లడిస్తున్నారు. న్యుమోనియాతో బాధ పడుతున్న వాళ్లు ప్లాస్మా చికిత్స చేయించుకోకుండదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్లాస్మా చికిత్స కరోనా రోగుల ఆరోగ్యాన్ని పెద్దగా మెరుగుపరచలేకపోయిందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

అదే సమయంలో కరోనా మరణాల రేటుపై కూడా ప్లాస్మా చికిత్స పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మరోవైపు ప్లాస్మా చికిత్స పురుషుల్లో టెస్టిస్ ను డ్యామేజ్ చేస్తుందని ఫలితంగా సంతానోత్పత్తికి సంబంధించిన సమయ్సలు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లాడిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే కరోనా వైరస్ మ్యుటేషన్ల వల్ల ఎలాంటి నష్టం లేదని.. మ్యుటేషన్ చెందిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం అపోహేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వృద్ధులకు మాత్రం ప్లాస్మా చికిత్స చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మరో అధ్యయనంలో వెల్లడైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here