Senior Journalist Bhardwaja : శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణ కమలం, సప్తపది ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఒక సందేశం అలాగే భారతీయ సంస్కృతి ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా అవి జనాలను ఆకట్టుకునేలా తీసి కమర్షియల్ సినిమా హవా ఉన్న సమయంలో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు కే విశ్వనాధ్ గారు. ఆయన డైరెక్టర్ గా తీసిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్న అయన ఆ తరువాత అందుకున్న అవార్డులకు లెక్క లేదు. ఇప్పుడు ఆస్కార్ గురించి మాట్లాడుతున్న చాలా మందికి తెలియని విషయం విశ్వనాధ్ గారి డైరెక్షన్లో వచ్చిన ‘సాగర సంగమం’ సినిమా 52వ ఆస్కార్ నామినేషన్స్ లో ఉత్తమ ఫారిన్ చిత్రంగా ఆఫీసియల్ ఎంట్రీ అందుకుంది. అంతే కాకుండా రష్యన్ లోకి విశ్వనాధ్ గారి ఎన్నో సినిమాలు డబ్ చేయబడ్డాయి. కాగా ఆయన 92 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 2న వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. అయితే ఆయన సినిమాల్లో ఎన్నో సినిమాల్లో కళలపట్ల ఆయనకున్న అభిరుచిని చూపారు.

కుల తపస్వి అంటూ విమర్శలు…
విశ్వనాధ్ గారు అయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం కథలో ఇమడ్చి చూపించడం ఆయనకు అలవాటు. అయితే ప్రతి సినిమాలోనూ అగ్ర కులాన్ని అలాగే సంస్కృతిని చూపించడం వల్ల ఆయనకు కుల పిచ్చిని అంటగట్టేసారు. ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడుతూ ఆయనకు కులం గురించి పట్టింపు ఉండి ఉంటే ఆయన శిష్యులను, ఆయన సినిమా టెక్నీషియన్స్ ను వాళ్ళనే పెట్టుకునేవాడు కానీ అందరితో కలిసి ఎందుకు పనిచేస్తారు అంటూ అభిప్రాయపడ్డారు. సమాజంలో అగ్ర కులస్థులు మనుషులంతా ఒక్కటే అనే స్టేట్మెంట్ ఇస్తే అందులో ఇంకేదో అర్థముందని అనుకోవాలి.

అదే నిమ్న కులస్థులు ఆ మాట అంటే వారు వివక్ష నుండి విముక్తి ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ధోరణిలోనే విశ్వనాథ్ గారి మీద కుల ముద్ర పడి ఉండవచ్చు. అయితే ఆయన అగ్ర కులంలో పుట్టినా సంస్కరణ భావాలతోనే ఉన్నారని చెప్పారు భరద్వాజ. ఆయన షూటింగులో పనిచేసేవారి వద్ద భుజం మీద చేయి వేసి మాట్లాడినపుడు జంజం ఉందా అని వెతుకుతారు అంటూ వర్మ లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ సరైనవి కాదని, ఆయన అందరితోనూ పనిచేసారు కదా అలానే ఆయన కింద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ లో గీతా కృష్ణ వంటి వారు ఉన్నారు, వారు వేరే కులం వాళ్ళు కదా, మరి ఎలా ఆయనకు కులం ఆపాదిస్తారు అంటూ మాట్లాడారు.

































