Srinivasa murthi: గుండెపోటుతో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణం!

0
53

Srinivasa murthi: ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా సెలబ్రిటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నటి జమున మరణ వార్త తెలియడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే జమున మరణించిన కొన్ని గంటల వ్యవధిలోని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణించారు. ఈయన గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో మరణించారు.

డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీనివాసమూర్తి తెలుగు తమిళ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం.డబ్బింగ్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీనివాసమూర్తి మరణించడంతో తెలుగు తమిళ సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఈయన అగ్ర హీరోలు అయినటువంటి సూర్యా, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

Srinivasa murthi: దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర పరిశ్రమ..


విక్రమ్ అపరిచితుడు, సూర్య సింగం సిరీస్, 24, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, అల వైకుంఠపురంలో జయరామ్ సుబ్రమణియన్ వంటి తదితరులకు ఈయన డబ్బింగ్ చెప్పారు ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనివాసమూర్తి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణించడంతో పలువురు శని సెలబ్రిటీలు తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.