Suriya: కుటుంబంతో విభేదాలు కారణంగానే సూర్య ముంబై వెళ్లారా… అసలు విషయం చెప్పిన హీరో?

0
41

Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు సూర్య గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.సూర్య భార్య జ్యోతికకు తన కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున విభేదాలు ఏర్పడ్డాయట. ఈ విభేదాలు కారణంగానే సూర్య తన భార్య పిల్లలతో కలిసి ముంబై షిఫ్ట్ అయ్యారు అంటూ ఓ వార్త వైరల్ అయింది.

ఇలా వార్తలకు అనుగుణంగానే సూర్య కూడా తన ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లారు.. ఇలా ముంబైలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సూర్యా అక్కడే ఉంటున్నారు. ఇలా ముంబైకి వెళ్లినటువంటి ఈయన తాజాగా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటుచేసి అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే పలువురు అభిమానులు వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ క్రమంలోనే ఒక అభిమాని సూర్య ముంబై కి షిఫ్ట్ అవ్వడానికి గల కారణాలను గురించి కూడా ఆరా తీశారు కుటుంబంతో గొడవలు కారణంగానే మీరు ముంబై వచ్చారా ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అంటూ సూర్యన ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సూర్య సమాధానం చెబుతూ తాను తమిళనాడు వదిలి ఎందుకు ముంబై రావాల్సి వచ్చింది అనే విషయాలను తెలిపారు.

Suriya: పిల్లల కోసమే..


తాను తన ఫ్యామిలీతో కలిసి ముంబై షిఫ్ట్ అవ్వడానికి కారణం తన పిల్లలని తెలిపారు. కుటుంబంతో విభేదాల కారణంగానే ముంబైకి వచ్చాననే వార్తలలో నిజం లేదని కొట్టిపారేశారు.పిల్లల చదువుల కోసమే తాను ముంబై వచ్చానని వారి చదువులు పూర్తికాగానే తిరిగి నేను చెన్నై వెళ్ళిపోతానని ఈ సందర్భంగా సూర్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో తన గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పడినట్లు అయింది.