Taraka Ratna: తారకరత్న క్షేమం కోసం మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించిన అభిమానులు!

0
95

Taraka Ratna: నందమూరి తారకరత్న ఇటీవల యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో అస్వస్థతకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రతిమ చికిత్స చేయించారు. ఆ తర్వాత బెంగళూరుకు తరలించి నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని డాక్టర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఇక బాలకృష్ణ కూడా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉంటూ తారకరత్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పటమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నిత్యం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు.
తారకరత్న క్షేమం కోసం బాలకృష్ణ మరొక అడుగు ముందుకు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్న బాలకృష్ణ తారకరత్న ఆరోగ్యం బాగుపడాలని అభిమానులందరూ ప్రార్థించాలని కోరాడు.

తారకరత్న క్షేమం కోసం మృత్యంజయ ఆలయంలో 44 రోజులపాటు అఖండ దీపం వెలిగించాలని సూచించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండటం బత్తలాపురంలో ఈ మృత్యుంజయ ఆలయం ఉంది. బాలకృష్ణ సూచన మేరకు తారకరత్న ఆరోగ్యం కోసం ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాక.. అఖండ జ్యోతి కూడా వెలిగించినట్లు సమాచారం. మునుపటితో పోల్చితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Taraka Ratna:మెరుగుపడుతున్న తారకరత్న ఆరోగ్యం…


ఇక ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బెంగళూరు చేరుకొని తారకరత్న ని పరామర్శించారు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు చింతించాల్సిన అవసరం లేదని వెల్లడించాడు. దీంతో నందమూరి అభిమానుల్లో కొంతవరకు ఆందోళన తగ్గింది. తారకరత్న తొందరగా కోలుకోవాలని ఇప్పటికే పలు ప్రాంతాలలో ఉన్న నందమూరి అభిమానులు టిడిపి కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు.