ఇప్పటివరకూ 27మంది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులపై దాడులు జరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులే అని అయన అన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో దారుణహత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను నారా లోకేశ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ‘‘హత్య కేసులో నిందితులంతా వైసీపీ పార్టీకి సంబంధిచిన వాళ్ళే.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే చాలు దాడులకు విరుచుకుపడుతున్నారు. కత్తితో బతికేవాడు.. రాజకీయాలు చేసేవాడు.. కత్తితోనే బలవుతాడు. టీడీపీ కార్యకర్తలను బెదిరించి నాయకులను చంపితే పార్టీ లేకుండా పోతుందా? ప్రజల తరఫున మేము ధైర్యంగా పోరాడుతాం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.






























