Gadwal MLA : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా విధించి అందులో రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.




































