ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే తాళం వేసి పోవడం అనేది సహజం. చుట్టు పక్కల వవరూ గమనించకుండా ఉంటే.. ఏ దొంగ అయినా ఇంట్లో దొంగతనానికి వస్తాడు. ఇలా వచ్చి.. తాళం పగల కొట్టి ఇంట్లో విలువైన వస్తువలు లేదా డబ్బులు, నగలు పట్టుకొని వెళ్తాడు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారి నివాసంలోకి చొరబడిన ఓ దొంగ..తాను ఊహించిన మొత్తంలో నగదు, ఆభరణాలు లభించకపోవడంతో నిరాశ చెందాడు.

దీంతో అక్కడ ఓ లేఖను రాసిపెట్టి వెళ్లాడు. ఆలేఖలో ఏముందో తెలుసా.. ఇంట్లో రూపాయి కూడా లేదు.. అలాంటి దానికి ఇంటికి తాళం ఎందుకు వేశావ్ అంటూ రాశాడు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని సివిల్ లైన్స్‌లోని త్రిలోచన్ గౌర్ బంగ్లాలో ఓ కలెక్టర్ నివాసం ఉంటున్నాడు.
అతడి ఇంట్లో కొద్ది రోజుల కిందట దొంగతనం జరిగింది. ఆ ఇంటిలో గత 15-20 రోజుల నుంచి లేరు. రూ. 30 వేలు, బంగారు ఆభరణాలు దొంగల అపహరించారు. ఇక ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం ఎందుకు వేయడం.. కలెక్టర్ అని ఓ చిటీపై రాసి దొంగలు వెళ్లిపోయారు. ఖాటేగావ్ ఎస్డీఎంగా విధులు నిర్వర్తిస్తున్న త్రిలోచన్ గౌర్.. రెండు రోజుల కిందట వచ్చిన ఆయన తన నివాసంలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు.
ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండగా.. కొంత నగదు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడే అతడి ఓ లేఖ దొరికింది. అందులో ఇంట్లో డబ్బులు లేకపోతే ఆ ఇంటికి తాళం ఎందుకు వేశావు? అని కలెక్టర్ ను ప్రశ్నించినట్లు రాసి ఉంది. దీనిని కూడా పోలీసులకు చూపించాడు కలెక్టర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.































