TS RTC: ప్రపంచం మొత్తం ఉక్రెయిన్- రష్యా సంక్షోభంపై ఆందోళన చెందుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటిస్తే.. అది పెద్ద యుద్ధానికే దారి తీసే అవకాశం ఉందని అంటున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికా కూడా రష్యా యుద్ధం చేస్తుందంటూ.. ప్రకటనలు ఇస్తోంది.

ఇదిలా ఉంటే ఎక్కడో రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు ఆర్టీసీపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య చమురు ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యారెల్ ధరలలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్క రోజువ్యవధిలో లీటర్ డిజిల్ ధర దాదాపు రూ. 6కు పెరిగింది. దీంతో సంస్థ ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సాధారణ ప్రజలకు కూడా పెట్రో మంటలు తగలాల్సి ఉన్నా.. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. కేంద్రం ధరలు పెంచడం లేదు.

కేంద్రం సాధారణ ప్రజలపై పెట్రో భారం పడకుండా చేస్తున్నా… ఆర్టీసీకి ఈ వెసులుబాటు లేదు. అసలే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి డిజిల్ రేట్లు గుదిబండగా మారాయి. ఈ కారణంగా ఆర్టీసీకి సగటు రోజకు రూ. 30 లక్షలు అదనపు భారం పడటంతో మరింతగా నష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతోంది. దీంతో చమురు కంపెనీల నుంచి నేరుగా డిజిల్ కొనే బదులు లూజుగా బంకుల నుంచి కొనేందుకు ఏర్పాటు చేసుకుంటుంది.
ఆయిల్ కంపెనీలకు ఆర్టీసీమే అతిపెద్ద కొనుగోలుదారు:
ప్రస్తుతం చమురు కంపెనీలకు ఆర్టీసీ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. బహిరంగమార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకే ఆర్టీసీకి వీరు ఇంధనం అందించేలా ఒప్పందాలు చేసుకుంటాయి. బయటి వాహనదారులకు దొరికే ధరతో పోలిస్తే ఎప్పటికప్పుడు లీటరుకు రూ.4 నుంచి రూ.5 చొప్పున తక్కువకే ఆర్టీసీర్టీ డీజిల్ పొందుతోంది. ఈ డిస్కౌం ట్ ప్రకారం..సంస్థకుస్థ సగటున నెలకు రూ.7.5 కోట్లు ఆదా అవుతోంది. ప్రస్తుతం ఈ విధానమే ఆర్టీసీ శాపంగా మారుతోంది. మూడు రోజుల క్రితం వరకు డిజల్ లీటరుకు రూ. 90.11 కొంటున్న ఆర్టీసీ .. ఇప్పుడ ఏకంగా రూ. 95.86కు కొనుగోలు చేయాల్సి వస్తోెంది. ప్రస్తుతం.. ఆర్టీసీ రోజుకు 5 లక్షల నుంచి 5.5 లక్షల డిజల్ ఉపయోగిస్తోంది. దీంతో ఆర్టీసీకి రూ. 28 లక్షల నుంచి 30 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.































