ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలోని సెయింట్ జాన్స్ కాలేజ్ సర్కులర్ పేరుతో ఒక సర్కులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరో రెండు వారాల్లో వాలంటైన్స్ డే రాబోతున్న నేపథ్యంలో అమ్మాయిలకు కనీసం ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలని.. ప్రేమికుల రోజు నాటి బాయ్ ఫ్రెండ్ లేకపోతే కాలేజీలోకి అడుగుపెట్టనియ్యమని ఆ సర్కులర్ లో పేర్కొన్నారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నిరూపించడానికి బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా తీసుకురావాలని సర్కులర్ లో ఉండటం గమనార్హం.

అమ్మాయిలకు వారి సేఫ్టీ కోసం బాయ్ ఫ్రెండ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్న ఆ కాలేజ్ సర్కులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ సర్కులర్ లో అమ్మాయిలు ప్రేమను పంచాలంటూ పేర్కొనడం గమనార్హం. వైరల్ అయిన ఈ సర్కులర్ స్థానికంగా కలకలం రేపడంతో ఆ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. ప్రొఫెసర్ అశిశ్ శర్మ పేరుతో ఆ సర్కులర్ ప్రచారంలోకి రావడం గమనార్హం.

సర్కులర్ చివరలో అమ్మాయిలూ.. ప్రేమను పంచండి అంటూ పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సదరు కాలేజీ యాజమాన్యం స్పందించి వైరల్ అవుతున్న సర్కులర్ గురించి వివరణ ఇచ్చింది. కాలేజీ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ అశిశ్ శర్మ పేరుతో తమ కాలేజీలో ఎవరూ పని చేయడం లేదని కాలేజీ పరువు తీసేందుకు ఎవరో ఫేక్ సర్కులర్ ను వైరల్ చేశారని తెలిపారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సర్కులర్ గురించి పట్టించుకోవద్దని.. ఫేక్ సర్కులర్ ను వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1850లో బ్రిటీషర్లు ఈ కాలేజీని స్థాపించగా ఫేక్ సర్కులర్ ను వైరల్ చేసిన వారెవరో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here