Varun Tej: బాబాయ్ కి మాఅవసరం ఉండకపోవచ్చు.. ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: వరుణ్ తేజ్

0
39

Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన సినిమా గాండీవ దారి అర్జున ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతూ వైసిపి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం బ్రో సినిమా వేడుకలో భాగంగా సినిమా అయినా, రాజకీయమైన బాబాయ్ వెంటే అంటూ వరుణ్ తేజ్ కూడా మాట్లాడారు.

ఈ క్రమంలోనే యాంకర్ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికలలో మీరు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపబోతున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ నాకు తెలిసి బాబాయ్ కి మాతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు అని తెలియజేశారు. ఆయనకు మా మద్దతు అవసరమైతే మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తుందని తెలిపారు.

Varun Tej: ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది..


కేవలం రాజకీయాల పరంగా మాత్రమే కాకపోయినా ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ బాబాయ్ కి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని వరుణ్ తెలిపారు. గత ఎన్నికలలో కూడా నా వంతు నేను సపోర్ట్ చేశానని తమ సపోర్ట్ ఎప్పుడూ బాబాయ్ కి ఉంటుందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.