ఈ జ్యూస్ లను తాగండి.. తక్కువ రోజుల్లోనే బరువు తగ్గండి..!

0
236

ఎవరైనా బరువుగా ఉన్నారంటే అది అనర్థాలకు దారి తీస్తుంది. వయస్సుకు తగ్గట్టుగా బరువు ఉండాలి. బరువు రోజూ పెరిగిపోతున్నామంటూ చాలా మంది బాధపడుతుంటారు. బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోగా మరియు వ్యాయామాలు చేస్తారు. కానీ బరువు మాత్రం తగ్గరు. దానికి తగ్గట్టుగా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

లేదంటే ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. దీంతో బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. ఎక్కువగా బరువు తగ్గాలని అనుకునే వారు జ్యూస్ లను తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. జ్యూస్‌లను తాగడం వలన ఆకలి ఉండదని.. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జ్యూస్ లల్లో ముఖ్యంగా టమోటో జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది.

రెండు నుంచి మూడు టమోటాలను తీసుకొని ఉడికించి మిక్సీలో వేసి తీసుకోవాలి. అందులో బెల్లం కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా రెండు మూడు రోజులు తాగితే.. ఏడు రోజుల్లో ఎంతో కొంత బరువు తగ్గుతారు. లెమన్ జ్యూస్ తీసుకుంటే శరీరంలో ఉండే చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. అంతేకాకుండా బరువు కూడా అదుపులో ఉంటుంది.

ద్రాక్ష జ్యూస్ తాగటం వలన కూడా బరువు తగ్గుతారు. ఆరెంజ్ జ్యూస్ లో కొద్దిగా తెనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునే వారు పైనాపిల్ జ్యూస్‌ తాగితే ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో ఆహార పదర్థాలు తినాలనే కోరిక తగ్గతుంది.దీంతో ఏది పడితే అది తినకుండా కోరికలు అదుపులో ఉండటంతో శరీరంలో కొలెస్టరాల్ పెరగకుండా ఉంటుంది.