Praneeth Hanumanth: వావి వరసలు మర్చిపోయి కన్న కూతురి పట్ల ఓ నీచుడు అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రముఖ యూట్యూబర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రణీత్ హనుమంత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల తన స్నేహితులతో కలిసి ఒక తండ్రి కుమార్తె రిలేషన్ గురించి ఈయన పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. ఇక ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా స్పందించారు. ముఖ్యంగా నటుడు సాయి ధరంతేజ్ ఈ వీడియో పై ఘాటుగా స్పందిస్తూ స్పందించడంతో ప్రభుత్వాలు కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యాయి.
ఇలా చిన్న పిల్లల పట్ల అసభ్యకరమైన పదాలు మాట్లాడటంతో చిన్నపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఇలాంటి వారి నుంచి పిల్లలను రక్షించుకోవాలని అలాగే ఈ విధమైనటువంటి కీచకపు ఆలోచనలు ఉన్న వారిని శిక్షించాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేశారు.
బెంగళూరులో అరెస్ట్..
ఈ విధంగా ఈ ఘటన పై సినిమా సెలబ్రిటీలందరూ కూడా స్పందిస్తూ తనకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా పోలీసులు ఈయనని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేసే హైదరాబాద్ పీటి వారంట్ పై ఇక్కడకు తీసుకువస్తున్నారు. ఇలా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ తో పోలీసులు తనని అరెస్టు చేయడంతో ప్రతి ఒక్కరు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


































