కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన సోనుసూద్..!

0
1206

ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనుసూద్ గత నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయన పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురయ్యారని 75శాతం అతనికి ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆయనకు చికిత్స అందించాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వార్త గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు రియల్ హీరో సోను సూద్ స్పందించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ ఇదే విషయం గురించి శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అతని చికిత్స కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎలాగైనా తన ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడటంతో ఆయన పెద్ద కుమారుడు, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇక తన భార్య హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక శివ శంకర్ మాస్టర్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించడమే కాకుండా జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here