Actor Suman: పొలిటికల్ ఎంట్రీ పై సుమన్ షాకింగ్ కామెంట్స్… తప్పకుండా రాజకీయాలలోకి వస్తానంటూ?

0
26

Actor Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం గురించి ఈయన మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆ సంఘటనపై సుమన్ తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా రజనీకాంత్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రజనీకాంత్ మాటలలో తప్పు లేదని తెలిపారు.

ఇక రాజకీయాల గురించి కూడా సుమన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తాను తప్పకుండా రాజకీయాలలోకి వస్తానని తెలిపారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తాను తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Actor Suman: అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుంది…


ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని ప్రతి ఏడాది వచ్చే ఈ విపత్తులు వర్షాల నుంచి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అంటూ ఈ సందర్భంగా సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.