Alekhya Reddy: తారకరత్నను తలుచుకొని ఎమోషనల్ అయినా అలేఖ్య రెడ్డి… ఆనంద సమయంలో మీరు లేరంటూ?

0
28

Alekhya Reddy: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు హాస్పిటల్లో మరణంతో పోరాడుతూ చివరికి మృతి కౌగిలిలో బంధి అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే తారకరత్న మరణించి ఇన్ని నెలలు అవుతున్న తన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఈ బాధ నుంచి బయటపడలేదు.

తరచూ ఈమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఇలా తారకరత్న మరణించిన సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రేమించిన వాడిని కుటుంబ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని తనతో పాటు వచ్చినటువంటి అలేఖ్య రెడ్డికి తారకరత్న దూరం అవడంతో ఈ నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఇలా తరచూ తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు అయితే నేడు మరోసారి తారకరత్నను తలుచుకొని ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ఇకపోతే నేడు తారకరత్న కవల పిల్లలు అయినటువంటి తాన్యారామ్ , రేయా ల పుట్టినరోజు. దీంతో బాగోద్వేగమైన ఒక పోస్టును షేర్ చేశారు.

Alekhya Reddy: ఇంద్రధనస్సు కంటే నువ్వే అందంగా ఉంటావు…


ముందుగా తన పెద్ద కుమార్తె తన తండ్రికి పువ్వులు పెడుతుండగా ఇద్దరు చిన్నారులు తనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఆనంద సమయంలో మీరు మాతో లేరు కానీ పిల్లల ముఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. వర్షం కురిసే రోజు ఇంద్రధనస్సు కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ప్రొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము.. మా ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను పెట్టింపు చేయాలని కోరుకుంటున్నాము. అద్భుతమైన మన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.