ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బైక్ టాక్సీ యాప్. ఈ క్రమంలోనే ఈ యాప్ ప్రచారకర్తగా అల్లుఅర్జున్ వ్యవహరించారు.ఈ ప్రచారం OOH, రేడియో, టీవీ, పాన్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 14 నగరాలపై దృష్టిసారించింది.

ఇక ఈ యాడ్ లో అల్లు అర్జున్ తెలంగాణ ఆర్టిసి సేవలను కించపరుస్తూ ఉన్నట్లు ఉండడంతో గతంలో ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగుల తో పాటు పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ యాడ్ లో పాల్గొన్న ఆర్టిసి సేవల సాధారణ దోసెలాగా నిదానంగా ఉంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని చెప్పడంతో ప్రజారవాణా కించపరిచినట్లు ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

తాజాగా మరోసారి తెలంగాణ కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నటువంటి ఈ ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారు అంటూ ఈ సందర్భంగా కోర్టు తీర్పును వెల్లడించింది.

































