Anam Ramanarayana Reddy : నెల్లూరి జిల్లా రాజకీయనాయకులలో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. వారిలో ఒకరైన వేంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నేత ఆనం రామ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు అనే ఆరోపణలు మీద వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. మొదట టీడీపీ లో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆపైన కాంగ్రెస్ మళ్ళీ టీడీపీ అంటూ చక్కర్లు కొట్టినా 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నిలబడి గెలిచారు. అయితే మొదటి సంవత్సరం నుండే స్వపక్షంలో విపక్షంలా తయారైన ఈయన ప్రభుత్వంలోనే జరుగుతున్న అవినీతి మీద మీడియా సాక్షిగా మాట్లాడటం వంటివి చేయడంతో జగన్ కి ఈయన పంటి కింద రాయిలా తయారయ్యారు. ఇక తాజాగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడి టీడీపీకి సహకరించారనే ఆరోపణల మీద సస్పెండ్ అయిన ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఇసుక దందా గురించి సీఎం ఎమన్నారాంటే…
జగన్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కాం అలాగే ఇసుక దందా గురించి జగన్ దృష్టికి తీసుకెళ్లానని అపుడు జగన్ గారు మీరే ఇలా అవినీతి అని చెబితే ఎలా, పనిగట్టుకుని ప్రతిపక్షం అలాగే పత్రికలు ఇక అదే న్యూస్ ని వేస్తూనే ఉంటారు, మీరు ఇలా అవినీతి జరుగుతోందని మాట్లాడకండి అని చెప్పారట. ఆయన దృష్టికి తీసుకెళ్లాలి గ్యాంగ్ లాగా ఏర్పడి ఇసుక మాఫియా చేస్తున్నారని చెప్పాలని అనుకున్నా కానీ ఆయనే మూల విరాట్ అని తెలియలేదు.

ఆ తరువాత జగన్ గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయమని చెప్పినా ఆయన మాకే చెబుతారా అన్నట్లు సమాధానము ఇచ్చేవారు. నియోజకవర్గం సమస్యల గురించి వెళితే మమల్ని డబ్బులు అడగొద్ధు, మీరే మాకు కావాలంటే ఇవ్వండి లేకపోతే మేము ఎపుడైనా ఇస్తే తీసుకోండి, మీరు మమల్ని డబ్బులు అడుగుతారా ప్రశ్నిస్తారా అన్నట్లు చూసేవారు. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యారు అందుకే నా మీద అర్థం లేని ఆరోపణలను చేసి సస్పెండ్ చేసారు. నేను టీడీపీ నుండి డబ్బు తీసుకోవడం చూసారా.. చూస్తే ఆధారాలతో బయట పెట్టమనండి అంటూ సవాల్ చేసారు.