Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా అనసూయ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నేను ఎమోషనల్ అవుతున్నాను. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు రంగ మార్తాండ సినిమాలో నేను నటించాను. నా జీవితానికి ఇది చాలు నేను నిన్నే సినిమా చూశాను.ఆల్రెడీ నటసామ్రాట్ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను. కానీ.. థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్ గా చూశాను.

Anchor Anasuya:ఎంతో పుణ్యం చేసుకున్నా…
ఇలా ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమాగా గుర్తుండిపోతుంది. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చిందిఅంటూ ఈమె కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
































