Balakrishna: బాలకృష్ణ పై అభిమానంతో నిత్యాన్నదానం చేస్తున్న అభిమాని… రియల్లీ గ్రేట్ అంటూ?

0
25

Balakrishna: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.బాలయ్య సినిమాలు కనక విడుదలవుతున్నాయి అంటే ఎంతో మంది అభిమానులు ఆ సినిమా విడుదల సమయంలో చేసే హంగామా మామూలుగా ఉండదు.ఇలా బాలయ్య అభిమానుల సినిమాల విషయంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా తమ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణకు వీరాభిమానిగా ఉన్నటువంటి ఉప్పుటూరి రామ్ చౌదరి అనే వ్యక్తి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు.ఈయన బాలయ్యకు వీరాభిమాని అయితే ఒకానొక సమయంలో శివ అనే తన స్నేహితుడి ద్వారా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో రోగులు భోజనం కోసం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి తెలిసి చలించి పోయారు.

ఈ క్రమంలోనే తన స్నేహితుల సహాయంతో చేతన ఫౌండేషన్ ద్వారా ఈయన బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బసవతారకం హాస్పిటల్ లో అక్కడ రోగులకు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలా బాలకృష్ణ పుట్టిన రోజు నుంచి ప్రతి రోజు అన్నదానం చేస్తూ బాలయ్య పై తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా ఎంతో మంది రోగుల ఆకలి కేకలను తీరుస్తున్నారు.

Balakrishna: ఇది కదా అభిమానం అంటే…


ఇలా ప్రతిరోజు నిత్యాన్న దానం చేస్తూ రోగులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. అన్నం,పప్పు, చారు, సాంబార్, గుడ్డు, చికెన్, వెజిటేబుల్ బిర్యాని, చికెన్ బిర్యాని వంటి ఆహార పదార్థాలనుఅందచేస్తూ రోగులకు ఆకలి తీరుస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఇది కదా నిజమైన అభిమానం అంటే అంటూ పెద్ద ఎత్తున ఇతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.