Balakrishna: అభిమానుల కోసం భారీ రిస్క్ చేయబోతున్న బాలయ్య… ఈసారి ఏకంగా అలా?

0
48

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక బాలయ్య దర్శక నిర్మాతల హీరో అని అంటుంటారు వారికి ఏం కావాలో 100% అలా నటించడానికి బాలయ్య ఎలాంటి అభ్యంతరాలు చెప్పరు అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా బాలకృష్ణ నటనపరంగా దర్శకులు ఏది చెబితే అది చేస్తారని ఆయన దర్శకుల మాటకు ఏమాత్రం నో చెప్పరు అంటూ పలువురు బాలకృష్ణ గురించి పలు సందర్భాలలో తెలియచేశారు.అయితే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా కోసం అనిల్ ఏకంగా బాలయ్యతో ఓ పాటలో ఫ్లోర్ స్టెప్స్ చేయించాలని భావించారట.

ఈ వయసులో బాలకృష్ణ చేత ఈ విధమైనటువంటి ఫ్లోర్ స్టెప్స్ చేయించడం కాస్త కష్టతరమైన పని అని చెప్పాలి కానీ ఈ విషయం బాలకృష్ణ గారికి చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా సరే చేసేద్దాం అంటూ ఫ్లోర్ స్టెప్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా బాలయ్య ఈ సినిమాలో ఫ్లోర్ స్టెప్స్ చేయబోతున్నారని అభిమానుల కోసం భారీ రిస్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.

Balakrishna: ఫ్లోర్ స్టెప్స్ చేయబోతున్న బాలయ్య..


ఇప్పటికే ఈ పాట కోసం బాలకృష్ణ భారీ స్థాయిలో రి హర్సిల్స్ చేశారని తెలుస్తుంది. దాదాపు పది రోజులపాటు బాలకృష్ణ ఈ పాటకు ప్రాక్టీస్ చేశారని తెలుస్తుంది.ఏది ఏమైనా నటన పరంగా దర్శక నిర్మాతలు ఏది చెబితే బాలయ్య అలా చేయటానికి ఏమాత్రం వెనకాడరని మరోసారి రుజువు చేసుకున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.