హౌస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ.. భావోద్వేగాల నడుమ సందడే సందడి..!

0
53

తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. ఇప్పటికే 12 వ వారం కంప్లీట్ కాబోతోంది. 80 రోజులకు పైగా హౌస్ లో ఉన్న వాళ్లకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ చేశారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కాజల్ భర్త, ఆమె కూతురును హౌస్ లోకి పంపించారు. దీంతో కాజల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాజల్ కూతురు అయితే మరీ ఎక్కువ ఆనందం వ్యక్తం చేసింది.

తాను ఇందులోకి వచ్చి.. నిన్ను కలుసుకుంటానని అనుకోలేదు మమ్మీ అంటూ.. హగ్ చేసుకుంటూ చెబుతుంది. తల్లిని చూడగానే కాజల్ కూతురు ఎమోషనల్ అయ్యింది. ఇక హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరినీ కాజల్ భర్త పలకరించాడు. శ్రీరామ చంద్ర మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే నీకు కోపం వస్తుందా అంటూ కాజల్ కూతురును అడగ్గా.. అవును అంటూ సమాధానం ఇస్తుంది.

ఎక్కువగా యానీ మాస్టర్ అంటే ఎక్కువగా కోపం వచ్చేదని.. ఆమె ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందంటూ చెప్పింది కాజల్ కూతురు. ఇక ఈ రోజు శ్రీరామ చంద్రకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ల సిస్టర్ కనిపించారు. మానస్ కోసం తన తల్లి వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేయనున్నారు. ఇక ఇదంతా ఇలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 5 చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ జశ్వంత్ ఎన్నికయ్యాడు.

రవి, షణ్ముఖ్ లాస్ట్ వరకు ఉండగా ఇద్దరిలో హౌస్ సభ్యులు ఎక్కవుగా షణ్ముఖ్ ను సపోర్ట్ చేయడంతో అతడు కెప్టెన్ అయ్యాడు. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా.. హౌస్ ఓ ఉన్న కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. చివరగా.. హౌస్ అంతా భావోద్వేగంతో కూడిన.. ఆనంద భాష్పాల మధ్య నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here