అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదే..!

0
713

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సండే,ఫండే ఎపిసోడ్ అయిపోయింది. నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడడానికి అంటే ముందుగా టీ తాగి తమతో ఒకరోజు ఎలా గడుపుతారు అన్నది చెప్పాలి అన్న టాస్క్ ను ఇచ్చాడు నాగ్. ఇంటి సభ్యులు సండే పండే అని ఆనందపడేలోగా ఎలిమినేషన్ డే కూడా అంటూ నాగార్జున గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పలు రకాల గేమ్ లను కూడా ఆడించారు.

ఇందులో ఇంటి సభ్యులు మిగతా వారిని అడగాలి అనుకున్న ప్రశ్నలను రాసి నాగార్జునకు ఇవ్వగా నాగార్జున ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మానస్ ప్రియాంకతో ఇకపై తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. పింకీ కూడా మానస్ తో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఎక్కువగా థంబ్ డౌన్ ఉంటే కాకరకాయ జ్యూస్ ను తాగాలి. ఇలా ఒకరి గురించి మరొకరు ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఒక హౌస్ మేట్ ను సేవ్ చేసాడు నాగ్.ఇందులో ఎవరూ ఊహించని విధంగా కాజల్ ముందుగా సేవ్ అయింది.

ఆ తర్వాత అనుభవించు రాజా టీమ్ బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చి సందడి సందడి చేశారు. ఆ తరువాత మైక్ పెట్టి అందులో మాట్లాడండి, క్లాప్స్ వస్తే సేవ్ అయినట్లు అని చెప్పగా ఇందులో మానస్, షణ్ముఖ్ సేవ్ అయ్యారు. ఆ తర్వాత మరో ప్రాపర్టీతో సిరి సేవ్ అయినట్లు ప్రకటించారు. కొంత సేపు సస్పెన్స్ తర్వాత ప్రియాంక, అనీ మాస్టర్ లలో అనీ మాస్టర్ ను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగ్.

ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకు వచ్చిన యాని మాస్టర్ నిరుత్సాహంగా కనిపించింది. వెళ్లే ముందు కాజల్ కి తప్ప అందరికీ అడ్వైజ్ లు ఇచ్చింది. నిజానికి అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి కారణం మాత్రం ఆమె ప్రవర్తన అని చెప్పవచ్చు. ఎందుకంటే టాస్క్ లలో ప్రతీసారి గ్రూప్ గేమ్ అంటూ మధ్యలోనే వదిలేయడం, నచ్చకపోతే గట్టిగట్టిగా అరిచేయడం, అవతలవాళ్లను ఎక్కిరించడం, కించపరచడం, కాజల్ ను వెక్కిరిస్తూ డ్యాన్స్ చేయడం లాంటివి చేయడంతో కానీ మాస్టర్ కు ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో అని మాస్టర్ 11వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.