Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మూడో తరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు చిన్నారి జన్మించారు. ఉపాసన జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా కొణిదెల అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పటివరకు మెగా మనవరాలని అభిమానులకు మాత్రం పరిచయం చేయలేదు.

ఇలా క్లిన్ కారా మెగా ఫ్యామిలీలో ఎంతో సంతోషం నెలకొంది.ఇకపోతే చిన్నారి జన్మించిన తర్వాత ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు చిన్నారి కోసం ప్రత్యేకంగా బహుమతులను పంపిస్తూ సర్ప్రైజ్ చేశారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇప్పటివరకు ఇండస్ట్రీకి చెందినటువంటి వారు అలాగే ఎన్టీఆర్ ప్రాణ స్నేహితులు చిన్నారి కోసం ఎన్నో కానుకలు పంపించారట.
ఇకపోతే మెగా మనవరాలు కోసం మెగాస్టార్ చిరంజీవి ఏ విధమైనటువంటి కానుకలు ఇచ్చారనే విషయం గురించి సందేహాలు వచ్చాయి. అయితే మెగా మనవరాలు కోసం చిరంజీవి అద్భుతమైన కానుకను ఇచ్చారని తెలుస్తోంది. మెగా మనవరాలి కోసం చిరంజీవి బంగారు ఆంజనేయస్వామి డాలర్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.

Chiranjeevi: ఆంజనేయస్వామి డాలర్…
మెగా కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామిని ఎంతో పూజిస్తారు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఉపాసన తల్లి కాబోతున్నారనే విషయాన్ని కూడా ఆంజనేయస్వామి ఆశీస్సులతోనే అంటూ చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం తమ మనవరాలు జన్మించింది అని సంతోషపడ్డారు అందుకే ఆంజనేయ స్వామి వంటి ధైర్యం బలం తన మనవరాలికి రావాలన్న ఉద్దేశంతోనే తన మనవరాలికి ఆంజనేయ స్వామి డాలర్ కానుకగా ఇచ్చినట్టు తెలుస్తుంది.