Colours Swathi: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం అయితే ఈ మధ్యకాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా విడాకుల కల్చర్ ఎక్కువగా ఉండేది అయితే ప్రస్తుతం ఈ కల్చర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అధికమైందని తెలుస్తుంది.

ఇప్పటికే నిహారిక సమంత వంటి స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా వీరి బాటలోనే మరొక హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. అచ్చం సమంత నిహారిక లాగే మరొక హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతుందని హింట్ ఇచ్చేశారు. మరి విడాకులకు సిద్ధమైనటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే…
పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తర్వాత హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి కలర్స్ స్వాతి తన భర్త వికాస్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ విధంగా ఈమె ఇన్ని రోజులు పాటు తన భర్తతో కలిసి విదేశాలలో స్థిరపడ్డారు అయితే ప్రస్తుతం హైదరాబాద్ వచ్చేసారు.

Colours Swathi: భర్త ఫోటోలు డిలీట్..
ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి కలర్స్ స్వాతి తిరిగి సినిమాలతో బిజీ అయ్యారు. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్తతో ఉన్నటువంటి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేశారు. దీనితో ఒక్కసారిగా విడాకులు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
కలర్స్ స్వాతి తన భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈమె కూడా సమంత నిహారిక లాగే విడాకులు తీసుకోబోతున్నారా అందుకే వారి మాదిరిగానే ముందుగా సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది తెలియాలి అంటే కలర్స్ స్వాతి స్పందించాల్సిందే.