ఫస్ట్ డోస్ ఓ వ్యాక్సిన్.. సెకండ్ డోస్ మరో వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుంది?

0
143

గత ఏడాది నుంచి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ అరికట్టడం కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ గురించి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. మొదటి డోసు ఒక రకమైన వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండవ డోసు వేరే రకం వ్యాక్సిన్ తీసుకుంటే ఏమౌతుంది? ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉండటం వల్ల ఈ విధంగా రెండు డోసులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనే సందేహాలు చాలామందికి తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నిపుణులు సైతం రెండు రకాల వ్యాక్సిన్లు కలిపి తీసుకుంటే ఏమవుతుంది అనే విషయం గురించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

కరోన మహమ్మారిని కట్టడి చేయడం కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే మన దేశంలో కూడా రెండు రకాల వ్యాక్సిన్లు ప్రజలకు అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక వ్యక్తి తొలి డోస్ ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకుంటాడో రెండవ డోసు కూడా అదే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వ్యాక్సిన్ వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు.

కొన్ని దేశాలలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండటం వల్ల ఈ విధంగా మొదటి డోసు ఒక రకం రెండవ డోసు మరొక రకం వ్యాక్సిన్ వేయటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.అయితే ఈ సమస్యలు ప్రమాదకరమైనవి కావు అని కేవలం సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ అని నిపుణులు తెలియజేశారు.

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు జరిపిన అధ్యయనంలో భాగంగా తొలి డోసు ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత రెండవ డోసు ఫైజర్ ఇవ్వడం వల్ల వారిలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తల తిరగడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు నిపుణులు తెలిపారు. అయితే ఇది వరకు ఇలాంటి పరిశోధనలు కేవలం వృద్ధులలో మాత్రమే పరీక్షించారు. యువతలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ శాతం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here