దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో కరోనా కేసులు పట్నం దాటి ప్రతి ఒక్క పల్లెకు విస్తరించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మూడు గ్రామాలలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఈ మూడు గ్రామాలు ఇటు తెలంగాణ అటు మహారాష్ట్రకు మధ్యలో ఉన్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ గ్రామాల చుట్టుపక్కల వైరస్ వ్యాప్తి ఈ విధంగా ఉన్నప్పటికీ ఈ మూడు గ్రామాలలో మాత్రం ఒక్క కరోనా కేసు లేకపోవడం ఎంతో ఆశ్చర్యం.

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండల పరిధిలోని పెంటదరి, ఇప్పచల్మ, లక్ష్మీ నగర్ మూడు ఆదివాసి గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఇందుకు గల కారణం ఈ గ్రామాలలోని ప్రజలు మూడు పూటలా ఆహారం కాకుండా అంబలిని సేవిస్తారు. అదేవిధంగా తమ పొలాలలో పండించిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఈ గ్రామాలలో ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పవచ్చు.

అంబలిని సేవిస్తూ, వేడి నీరు తాగడం,బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ పసుపు నీటితో స్నానం చేయడం ఈ గ్రామాల కట్టుబాట్లు. సాయంత్రం 6 దాటితే గడపదాటి ఒక్కరు కూడా బయట కనిపించరు. ఈ గ్రామాలలో జరిగే శుభకార్యాలను కూడా వాయిదా వేసుకున్నారు. చావుకు మాత్రం భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడమే ఈ గ్రామ ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పవచ్చు.

ఇప్పచెల్మ గ్రామంలో అయితే 85 ఏళ్ల ఔషద మూలిక వైద్యుడు దొందన్న ఇచ్చే మూలికల ద్రావణమే ఇక్కడ అమృతంగా పనిచేస్తుందని తెలిపారు. సుమారు 21 ఔషధ మొక్కల నుంచి తయారుచేసిన మూలికా ద్రావణం ఈ గ్రామంలో ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారు. ఈ ఔషధం సేవిస్తున్న గ్రామ ప్రజలకు దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఏమీ లేవని వారు తెలిపారు.

ఈ మూడు గ్రామాలు చుట్టుపక్కల ఉన్న ఊర్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఈ గ్రామాలలోని ప్రజలు మాస్క్ లను ధరించి తిరుగుతున్నారు.ఈ విధమైన కఠిన నిబంధనలను పాటించడం వల్లే ఇప్పటివరకు ఆ గ్రామాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here