రెండు వ్యాక్సిన్లు వేయించుకున్న.. కరోనా డెల్టా వదలదు?

0
175

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఉధృతి క్రమంగా తగ్గుతున్న క్రమంలో ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ క్రమంలోనే ఈ మహమ్మారి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో మరోసారి పంజా విసరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మనదేశంలో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో నష్టాన్ని కలిగించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వేరియంట్ మరికొత్త రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్ గా పంజా విసురుతుంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు అధికంగా నమోదయ్యాయి. అదేవిధంగా 2 మరణాలు కూడా సంభవించినట్లు అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులో పలు రాష్ట్రాలలో నమోదు కావడం వల్ల కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలను సూచించింది. ప్రస్తుతం మన దేశంలో వ్యాప్తి చెందుతున్న టువంటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మరో తొమ్మిది దేశాలలో కూడా వ్యాపించి ఉందని ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మూడు ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం, ఊపిరితిత్తుల కణాలకు నేరుగా అంటుకుపోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగకపోవడం.. వంటి లక్షణాలు ఈ వైరస్‌లో ఉన్నాయి.

డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ సమర్థవంతంగా తీసుకున్నప్పటికీ డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకసారి కరోనా బారినపడిన వారిలో నేనూ, అదేవిధంగా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మనదేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో థర్డ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందుకోసమే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి తగినన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అధికారులు తెలియజేస్తున్నారు. రెండవ దశ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here