Dhanraj: నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలియదు అంటూ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న ధనరాజ్!

0
45

Dhanraj: ధనరాజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించినటువంటి ఈయన తెలుగు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ అందరిని మెప్పించారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమంలో ధనాధాన్ ధనరాజు పేరిట ఈయన భారీ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా 10 వారాల పాటు కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండి తెర సినిమాలలో కూడా బిజీగా ఉన్నటువంటి ఈయన జీ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి ఫ్యామిలీ నెంబర్ వన్ అనే కార్యక్రమంలో హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ధనరాజ్ వేదికపై తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆయనని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎలా ఉంటారనే విషయం తెలియదు. తండ్రి ఆలనా పాలనలో నేను పెరగలేదని తెలిపారు. నా తండ్రి ఇలా ఉంటారా అలా ఉంటారా అని ఊహించుకునే వాడినని తెలిపారు.


Dhanraj: రక్తసంబంధీకులే లేరు…


ఇక నాకు చిన్నప్పుడు నా అనే రక్త సంబంధీకులు అంటూ ఎవరూ లేరు పెళ్లి జరిగిన తర్వాత నా కొడుకులే నా రక్తసంబంధీకులు అంటూ ఈయన తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకొని తన ఫ్యామిలీని చూపించారు. అయితే తన తండ్రి ఇలా వేదికపై ఎమోషనల్ కావడంతో తన పెద్ద కుమారుడు వేదిక పైకి వెళ్లి తన తల్లి తండ్రి తన ప్రపంచం అంటూ తాను కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ధనరాజ్ తన తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా అందరికీ కన్నీళ్లు తెప్పించారని తెలుస్తోంది.