ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు సూసైడ్ విషయం పై అసలు నిజం బయట పెట్టిన డైరెక్టర్ భాస్కర్..!

0
1197

డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా సిద్ధార్థ జంటగా తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఆ దర్శకుడి పేరు ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. బొమ్మరిల్లు సినిమా తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ హీరోగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదేవిధంగా తన జీవితంలో హిట్ ఫ్లాప్ అనేది రెండు సమానంగా ఉంటాయని మన జీవితంలో రెండింటిని సమానంగా తీసుకోవాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆరెంజ్” సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఏ సినిమాకి కూడా అంత కష్టపడి పని చేయలేదని ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా చేసినందుకు తనకు ఎంతో హ్యాపీగా ఉందని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత నాగబాబు ఎంతో నష్టపోయారు. ఇలా నష్టపోవడంతో నాగబాబు సూసైడ్ చేసుకోవాలని భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఇందులో ఎంత వరకు నిజం ఉందనే ప్రశ్న భాస్కర్ గారికి ఎదురవడంతో… ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని… అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమేనని నాగబాబు గురించి వచ్చిన వార్తలను బొమ్మరిల్లు భాస్కర్ కొట్టిపారేశారు. ఒక సక్సెస్ ను మనం ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటామో ఫెయిల్యూర్ ను కూడా అదే విధంగానే యాక్సెప్ట్ చేయాలని తన దృష్టిలో రెండు ఒకటేనని తెలియజేశారు.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్క బ్యాచిలర్ ని ఆలోచింపజేస్తుందని… ఇందులో అఖిల్ క్యారెక్టర్,లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ఆదరించాలని తెలియజేశారు.