స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. లోన్ ఇస్తున్న ఎయిర్‌టెల్!

0
185

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే నేటికీ కొన్ని కారణాల వల్ల చాలామంది స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారికి దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ శుభవార్త చెప్పింది. జీరో కాస్ట్ లోన్ పేరుతో ఎయిర్ టెల్ 2జీ వినియోగదారులు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి లోన్ ఇస్తోంది. ఐడీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎయిర్ టెల్ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.

ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ కొనాలకునేవారికి ఇచ్చే ఫోన్ ధర 6,800 రూపాయలు కాగా బ్యాంక్ డౌన్ పేమెంట్ 3,259 రూపాయలు లోన్ గా పొందవచ్చు. ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు 603 రూపాయలు ఈఎంఐ రూపంలో నెలనెలా చెల్లించాలి. ఈఎంఐ కాలపరిమితి పది నెలలు కాగా వినియోగదారుని మొబైల్ టారిఫ్ ప్లాన్ ను కూడా ఎయిర్ టెల్ ఇందులోనే కట్ చేసుకుంటుంది. మొబైల్ తీసుకున్న రోజు నుంచి పది నెలలు కస్టమర్లు రీఛార్జి చేయించుకోవాల్సిన అవసరం లేదు.

మొత్తంగా వినియోగదారుడు ఫోన్ కోసం 9,289 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్ కాస్ట్ తో పోలిస్తే తక్కువ ధరకే మొబైల్ ను అందిస్తున్నామని.. ఈ మొబైల్ వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఎయిర్ టెల్ చెబుతోంది. కేవలం 2 నెలలు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. మరోవైపు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌ను 200కు పైగా డివైజ్ లను అందిస్తోంది.

వినియోగదారులు సిగ్నల్ సమస్యలు ఏర్పడితే వైఫై ద్వారా వాయిస్ కాల్స్ ను మాట్లాడుకోవచ్చని ఎయిర్ టెల్ చెబుతోంది. నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాలలో సులభంగా వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here